Thursday, November 21, 2024

వస్త్ర పరిశ్రమకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా

జీఎస్టీ కౌన్సిల్‌ 46వ భేటీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈరోజు (శుక్రవారం) ఉదయం ప్రారంభమైంది. కాగా, పలు అంశాలపై చర్చించిన కమిటీ వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దాన్ని 12శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్‌. టెక్స్‌టైల్స్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అయితే, చాలా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చినందున ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రస్తుతానికి దానిని వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement