Friday, November 22, 2024

దేశం గట్టి గట్టోళ్లనే ప్రధానులుగా చూసింది.. ఇప్పుడు పేదల కోసం కిచిడీ ప్రభుత్వమే కావాలే: అసదుద్దీన్‌

దేశం ఎంతో మంది శక్తివంతమైన, గట్టి గట్టోళ్లను ప్రధానులుగా చూసిందని, ఇప్పుడు పేదల కోసం బలహీనమైన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం అవసరమని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఈ ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో శనివారం అహ్మదాబాద్‌లో ఒవైసీ పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీతో పాటు బెంగాల్‌, బిహార్‌ సీఎంలు మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌పై అసదుద్దీన్​ విమర్శలు గుప్పించారు.

‘దేశానికి బలహీనమైన ప్రధాని అవసరమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్పుడు బలహీనులకు సహాయం చేయడానికి బలహీనమైన ప్రధాని కావాలి. బలవంతుడు బలవంతులకు సహాయం చేస్తాడు. బలహీనుల వైపు కూడా చూడలేడు’ అని అసదుద్దీన్​ అన్నారు. ఇటీవల బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నితీశ్‌పై ఆయన మండిపడ్డారు. గోద్రా ఘటన సమయంలో ఆయన బీజేపీలోనే ఉన్నారని, పలుసార్లు ఎన్‌డీఏను గెలిపించేందుకు చేరి.. మళ్లీ బయటకు వచ్చారని, తాజాగా ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారన్నారు. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీనిపై అసద్‌ ఫైర్‌ అయ్యారు. ఆమె గతంలో ఎన్‌డీఏలో కొనసాగారు కదా.. అని క్వశ్చన్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement