Sunday, November 24, 2024

Political Satire: తెలంగాణ లీడ‌ర్ల ‘రాజీ’కీయం.. స‌భ‌ల‌లో స‌వాళ్లు, ప్రైవేట్‌గా దోస్తానా!

అబ్బా, సెగెట్రీ ఎప్పుడూ ప‌నులు బిగినెస్సేనా.. ఆహ్‌.. ప‌రిగ‌డుపునే కాసింత ప‌చ్చిగాలి పీల్చేయ్‌.. ఆ ప‌త్య‌క్ష నారాయ‌ణుడి సేవ చేసుకోవ‌ద్దూ..

ఊకూకెనే ఎస్సార్ కాదు, క‌ల్లెట్టుకు సూడు.. పైనేదో మ‌డ్డ‌ర్ జ‌రిగిన‌ట్టు లేదూ ఆకాశంలో.. సూరుడు నెత్తురు గ‌డ్డ‌లా లేడూ.. మ‌డిస‌న్నాక కాసింత క‌ళాపోష‌ణుండాల‌య్యా.. ఉత్తినే తిని తొంగుంటే మ‌డిసికీ గొడ్డుకీ తేడా ఏటుంట‌దీ.

నారాయుడు ఆ ఎగస్పార్టీ వాళ్లు ఇచ్చే డబ్బూ నువ్వే ఇవ్వరా అంటే ఇనిపిచ్చుకున్నావా.. కారు ఎనక సీట్లో దర్జాగా కూర్చొని వెళ్లేవాడివి. ఇప్పుడు డిక్కీలో తొంగున్నవ్.. ఆ దర్జా తగ్గిపోలా?

గ‌దిలోకెళ్లి మ‌ట్లాడుకుందాం రండి. వ‌ద్దులేండి గోడ‌ల‌కు చెవులుంట‌య్‌.. య‌వ్వారాలు మాట్లాడుకోవ‌డానికి ఇదే సేఫ్టీ.. మీకు నాకు కంప‌ర‌మైజేష‌న్ కుదిరితే.. బాగుంటుంది. సెప‌రేష‌న్ కేసన్న‌మాట‌.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లాం.. ఎదురింటోడితో లేచిపోయానా బాధ‌ప‌డ‌ను కానీ, ఒక్క‌రోజు కూడా అధికారం లేకుండా ఉండ‌లేను..

- Advertisement -

… ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాల‌రావు బెస్ట్ డైలాగ్స్.. నాటి నుంచి నేటి దాకా ఎవ‌ర్‌గ్రీన్‌ డైలాగ్స్ అంటే ఇవే… ఇట్లాంటి డైలాగ్స్‌ని నిజం చేసేలా మ‌న పాలిటిక్స్ త‌గ‌ల‌డ్డాయంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు. ఎందుకంటే.. జ‌నాల అంద‌రిముందు తెగ తిట్టుకోవ‌డాలు, స‌వాళ్లు విసురుకోవ‌డాలు, తొడ‌లు కొట్టుకోవ‌డాలు చేసే కొంత‌మంది లీడ‌ర్లు.. ఇప్పుడు ఒకే ద‌గ్గ‌ర ఎంచ‌క్కా టీ తాగుతూ క‌నిపించ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. చేతిలో చేయివేసుకుని, ముచ్చ‌ట్లు పెడుతుండ‌డంపై ‘‘ఓర్నీ ఇదేం ఫ్రెండ్‌షిప్‌రా నాయ‌నా? ఇట్లాంటి గ‌ప్పాలు కొట్టే లీడ‌ర్ల కోస‌మా మ‌నం కొడ్లాడుకునేది’’ అనుకుంటున్నారు విలేజీ పీపుల్‌.. ఈ వీడియో చూసిన చాలామంది సెటైరికల్​గా కామెంట్స్​ చేస్తున్నారు.. తెగ తిట్టుకుంటున్నారు కూడా…

మరి మీరు కూడా ఈ వీడియో చూసేసీ.. మంచి చెడ్డ గురించి రాసేస్తరు కదండీ.. ఆయ్​!

Advertisement

తాజా వార్తలు

Advertisement