Friday, November 22, 2024

Breaking | బాలికల అభ్యర్థనకు స్పందించిన కలెక్టర్ .. సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు

నర్సింహులపేట, (ప్రభన్యూస్): మా బజారుకు రోడ్డు పోయించండి సార్.. అని ఇద్దరు చిన్నారులు ఇవ్వాల (బుదవారం) వరంగల్​ క లెక్టర్​ శశాంకను వేడుకున్నారు. ఈ వార్త ఆంధ్రప్రభ వెబ్​సైట్​లో రావడంతో పెద్ద ఎత్తున సర్క్యులేట్​ అయ్యింది. చిన్నారులు కలెక్టర్​ను కలిసిన వార్త వైరల్​ కావడంతో దీనిపై కలెక్టర్ శశాంక స్పందించారు. ఆ వీధికి వెంటనే సీసీ రోడ్డు వేయించేందుకు చర్యలు తీసుకున్నారు.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ శశాంక నర్సింహులపేట మండల కేంద్రంలో జరిగిన సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సభ ముగిశాక వేదిక దిగి కలెక్టర్ వెళ్తుండగా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన వేటకారి వెంకట్ రాములు కూతుళ్లు నందిని, పూజిత వచ్చి మా బజారుకు రోడ్డు వేయించండి అని వేడుకున్నారు. ఈ వార్తను ‘ఆంధ్రప్రభ’ ప్రచురించగా దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించారు. సంబంధించిన మండల అధికారులను బాలికల ఇంటి వద్దకు పంపి విషయాన్ని తెలుసుకున్నారు. 20మీటర్ల సీసీ రోడ్డును వేయడానికి చర్యలు చేపట్టారు. స్పందించిన కలెక్టర్ శాంశకకు, వార్త ప్రచురించిన ఆంధ్రప్రభకు బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement