Friday, November 22, 2024

కాలేజీల్లో హెచ్ఐవీ టెస్టులు చేయాలన్న సీఎం… ఎక్క‌డంటే….

త్రిపుర రాష్ట్ర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్ కుమార్ దేవ్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర‌ రాజ‌ధాని అగర్తలాలో ప్రతిరోజూ మూడు హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయట.. అందులోనూ కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని.. దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందని.. పరిస్థితిని అదుపుచేసేందుకు ఆరాష్ట్ర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్ కుమార్ దేవ్ కాలేజీల్లో విద్యార్థులకు హెచ్ఐవీ టెస్టులు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

రాష్ట్రంలో హెచ్‌ఐవీ టెస్ట్‌లు భారీగా వెలుగు చూస్తున్నాయని.. ఈ కేసుల్లో రాష్ట్ర రాజధాని అగ్రస్థానంలో ఉండ‌డంతో కాలేజీల్లో విద్యార్థులకు హెచ్ఐవీ టెస్టులు నిర్వ‌హించాల‌ని సీఎం తెలిపారు. అలాగే డ్రగ్స్‌ మూలాలను కూడా కనుక్కోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు స్పష్టం చేశారు సీఎం. ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణం డ్రగ్స్‌గా భావిస్తోంది ప్రభుత్వం.. మాదకద్రవ్యాల వినియోగంతోనే ప్రతికూల మనస్తత్వం ఏర్పడుతుందని… దీంతో విద్యార్థులు పెడదారులు తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement