మనుషులు మచ్చిక చేసుకునే జంతువుల్లో కుక్క ఒకటి. విశ్వాసానికి ఇది మారుపేరు. దీన్ని బెస్ట్ ఫ్రెండ్‌గా పరిగణిస్తుంటారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కరోనా బాధితులను గుర్తించే శక్తివంతమైన సాధనంగానూ గుర్తింపు పొందుతోంది. అమెరికాలోని ఓ పాఠశాలలో శునకాలను ప్రజారోగ్య రక్షకులుగా అభివర్ణిస్తున్నారు. కోవిడ్-19 కేసులను గుర్తించడానికి ప్రత్యేకంగా హుంటా, డ్యూక్ అనే రెండు శునకాలకు శిక్షణ ఇచ్చారు. ఇవి మసాచుసెట్స్‌లోని డిస్ట్రిక్ట్ స్కూళ్లలో తిరుగుతూ కరోనా సోకిన విద్యార్థులను పసిగడుతుంటాయి.
ఫ్రీటౌన్ లేక్విల్లే రీజనల్ స్కూల్ క్యాంపస్‌లలో 14నెెలల వయసు గల లాబ్డార్లను ఉపయోగిస్తున్నారు. రెండు కుక్కలకు బ్రిస్టల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, ప్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ శిక్షణ ఇచ్చాయి. బ్రిస్టల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ట్విట్టర్లో ఈ కుక్కల ఫోటోలను షేర్ చేసింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ చేసిన మరో అధ్యయనం ప్రకారం కుక్కలు 6-8 వారాల శిక్షణ తర్వాత కోవిడ్‌ను ఖచ్చితంగా గుర్తించగలవు అని తేలింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital