Friday, November 22, 2024

Telangana | రామప్ప శిల్ప‌క‌ళా సౌంద‌ర్యం అద్భుతం.. సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ‌దేవి

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: రామప్ప దేవాలయ ఖ్యాతిని నిలిపేలా తెలంగాణ ప్ర‌భుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని ఆర్థిక‌ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి అన్నారు. ఇవ్వాల (బుధవారం) ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ కట్టడంగా కీర్తి గడించిన రామప్ప దేవాలయాన్ని శ్రీ‌దేవి సందర్శించారు. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎస్‌. కృష్ణ ఆదిత్య, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవితో క‌లిసి ఆల‌యాన్ని సంద‌ర్శించిన‌వారిలో ఉన్నారు.

కాగా, కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య ఆలయ విశిష్టత, చరిత్రను ఆలయ గైడ్ ద్వారా తెలుసుకున్నారు. రామప్ప శిల్పకళా సౌందర్యాన్ని చూసి టీకే శ్రీదేవీ ఆశ్చర్యానికి లోనయ్యారు. గుడిలోని రాతి కట్టడాలను, శిల్ప కళా నైపుణ్యాన్ని వారికి గైడ్‌ వివరించారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్ర‌మంలో కలెక్టర్‌ రామప్ప చెరువు ప్రత్యేకతతో పాటు ఉపాలయాల పరిరక్షణకు, నిర్మాణాలకు తీసుకుంటున్న చర్యల గురించి ఆర్ధిక శాఖ కార్యదర్శికి వివరించారు. గుడిలోని రాతి కట్టడాలను, శిల్ప కళా నైపుణ్యాన్ని గైడ్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement