Tuesday, November 26, 2024

తెల్లవారు జామున మూడు గంట‌ల దాకా బార్లు ఓపెన్‌.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలోని బార్లలో తెల్లవారుజామున 3 గంటలవరకు లిక్కర్‌ అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధి కారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్త వేళలను అమలు చేయడంలో పోలీసులు, ఇతర ఏజెన్సీల సమస్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పరిధిలో ఎక్సైజ్‌ శాఖ ఉంది. రెస్టారెంట్ల మూసివేత సమయాన్ని పొడిగించడం తెల్లవారు జామున మూడు గంటల వరకు బార్లు తెరిచి ఉంచడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, వేధింపులు తలెత్తకుండా చూసే బాధ్యత పోలీసులు, ఎక్సైజ్‌ శాఖాధికారులదరిద‌ని ఆయన పేర్కొన్నారు.

గుర్‌గావ్‌, నోయిడాతో సహా ఎన్‌ సి ఆర్‌ నగరాలలో తెల్లవారు జామున మూడు గంటల వరకు రెస్టారెంట్ల నిర్వహణ సమయాలను అనుమతించే కొత్త ఎక్సైజ్‌ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం నవంబర్‌ 2021లో ఆమోదించింది. ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌లో దేశ రాజధాని లో కొన్ని సాంస్కృతిక, నైట్‌ లైఫ్‌ కార్యకలాపాలను తీసుకురావడానికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని కూడా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement