హైదరాబాద్‌లో ఇవ్వాల ఎయిర్టెల్ నెట్వర్క్ సతాయిస్తోంది. చాలామంది కాల్స్, ఇంటర్నెట్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. 5జీ సర్వీసులు అందిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటూ యూజర్ల నుంచి చార్జీలు దండుకుంటున్న కంపెనీ.. కనీసం ఆ మేరకు సర్వీసును అందించలేకపోతోంది.
ఇక.. ఇవ్వాల (మంగళవారం) హైదరాబాద్‌లోని మెయిన్ ఏరియా అయిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో కనీసం సిగ్నల్స్ కూడా లేకుండా పోయాయి. కొద్దిసేపు అయితే.. పాతకాలం నాటి మాదిరిగా ఎడ్జ్ నెట్వర్క్ చూపిస్తుండడంతో యూజర్లు ‘‘ఇదేం నెట్వర్క్ రా నాయనా?” అని నవ్వుకుంటున్నారు. ఇవ్వాల ఒక్కరోజే నెట్వర్క్ పరంగా కంపెనీ కాల్ సెంటర్‌గా లక్షలాదిగా కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది.