విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులే సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ఈ ఘటనలో ఓ లేడీ లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడగా ఆమెతో ఎఫైర్ పెట్టుకున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలోని సాంఘిక సంక్షేమ కళాశాలో జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ఇన్ చార్జి అదే కాలేజీలో పని చేస్తున్న ఓ మహిళా లెక్చరర్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఓ రోజు విద్యార్థులంతా రీడింగ్ అవర్ లో ఉండగా వీరిద్దరు పక్క గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. ఇంతలో ఈ విషయాన్ని మరో ఉపాధ్యాయుడు గమనించి వీడియో తీశాడు. ఇదేం పనంటూ నిలదీశాడు. దీంతో వీడియో కారణంగా తన పరువు అంతా పోతుందని భావించిన ఆ మహిళా టీచర్ తన రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన మహిళా గిరిజన కుటుంబంలో పుట్టి పెరిగి కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించిన యువతి. కొంత కాలంగా తీవ్రమైన లైంగిక వేధింపుల వల్లే ఆమె ఒకరికి బలవంతంగా దగ్గర కావాల్సి వచ్చినట్టు.. దీనిని ఓర్వలేని మరొక ఉపాధ్యాయుడు ఆమెను టార్గెట్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.