ఒకవైపు అరేబియా సముద్రం.. మరోవైపు నది.. ఈ స్పెషల్ మూమెంట్ ఎక్కడ కనిపిస్తోందో తెలుసా.. ఇట్లాంటి బీచ్ గురించి తెలుసుకోవాలనుందా.. అయితే ఈ వార్త చదవాల్సిందే.. ఈ బీచ్ ను చూడ్డానికి ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు.
హైవేకి ఇరువైపులా సముద్రం.. నది ఉండడమే దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి అరుదైన కలయిక మరెక్కడా కనిపించదు. ఇది భారతదేశంలో ఉన్న అత్యంత అరుదైన సన్నివేశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మరవంతే బీచ్.. ఇది కర్నాటకలో ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అరేబియా సముద్రం ఒకవైపు.. సౌపర్ణికా నది మరోవైపు మధ్యలో రోడ్డు.. ఇట్లాంటి సోయగాన్ని చూడాలంటే మామూలు విషయం కాదు. అది అనుభవిస్తే కానీ వర్ణించడం సాధ్యం కాదంటున్నారు ప్రకృతి ప్రేమికులు..