తెలంగాణ స్థాయికి కేంద్ర ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే ఎంతో బాగుండేది. కేంద్ర ప్రభుత్వం దద్దమ్మ పాలన వల్ల ఒక్క తెలంగాణ ప్రభుత్వం 3వేల కోట్లు నష్టపోయింది. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది. వాళ్ల వల్ల ఇచ చేతకావడం లేదు. ఇప్పుడు కూడా చెబుతున్నాం, రేపు చెబుతాం. అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలు వెల్లడించారు. బీజేపీ నేతల తీరు, కేంద్ర ప్రభుత్వం పాలనా తీరుపై మండిపడ్డారు.
‘‘కేంద్ర ప్రభుత్వం 100కు 100శాతం మారాలే. చాతకాని ప్రభుత్వం మారాల్సిందే. డబుల్ ఇంజిన్ సర్కారు అని ప్రధాని మోదీ, బీజేపీ లీడర్లు చెప్పింది వాస్తవమే. తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ ఎక్కువున్నది. కేంద్రం స్పీడ్ తక్కువున్నది. ఇప్పుడు ఎవలైనా ఏది కోరుకుంటరు. స్పీడ్‌గా ఉన్న డబుల్ ఇంజిన్ కావల్నా, స్పీడ్ తక్కువున్న డబుల్ ఇంజిన్ కావాల్నా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇగ.. ఉత్తరప్రదేశ్ నుంచి ఒకయన వస్తడు. లుంగి కట్టుకుని సీఎం.. ఆయన చెప్తే మనం వినాల్నా, మనం తరించాల్నట. బాగాలేదా రాహుల్ ఇది.. అని సీఎం కేసీఆర్ వ్యంగంగా అన్నారు.
వాళ్ల పర్క్యాప్టా 7వేలు మాత్రమే. సిక్కింతోటి పోలిస్తే వీళ్లు ఆత్మహత్య చేసుకోవాలే. తమిళనాడు పర్క్యాప్టా ఎంతుంటదండీ.. 2లక్షలకు పైగా ఉన్నది. బీజేపీ, నాన్ బీజేపీ రాష్ట్రాలకు కంపేర్ చేస్తే ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువుంటది. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలన్నీ పర్క్యాప్టా ఎక్కువున్నయి. బీజేపీ రాష్ట్రాల్లో చాలా తక్కువున్నదని సీఎం కేసీఆర్ లెక్కలతో సహా వెల్లడించారు. పవర్ ఫుల్ ఇంజిన్ ఉన్నోడు ఎవడైనా తక్కువ స్పీడ్ ఉన్న ఇంజిన్ కావాలనుకుంటడా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఫిగర్స్ అన్నీ ఘనత వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ చెప్పిన లెక్కలే ఇవి అని చమత్కరించారు. మోకాలెత్తు లేని దద్దమ్మ కూడా కారుకూతలు కూస్తున్నడు.