తెలంగాణ మంత్రి కేటీ రామారావు కేంద్ర హోం మంత్రి అమిత్ షా టూర్‌పై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని పరోక్షంగా ఈ ట్వీట్లో వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్ మంజూరు చేయలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలేదని వంగ్యాస్త్రాలు సంధించారు.
గత తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించగలరా? అంటూ కేంద్ర మంత్రి అమిత్‌షాకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవ్వాల (ఆదివారం) కేంద్ర హోం మంత్రి చేవేళ్ల పర్యటనకు వచ్చిన సందర్భంగా అమిత్‌షాను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.