Monday, October 21, 2024

TG – కేసీఆర్ పాలన వచ్చే వరకూ పోరాటం చేద్దాం – హరీశ్ రావు

ఉమ్మడి కరీంనగర్, బ్యూరో,( ఆంధ్రప్రభ )మళ్ళీ రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని కేసీఆర్ పాలన వచ్చే వరకూ పోరాటం చేద్దామని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు నిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి లో మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ సమావేశం చూస్తే 2001 నాటి రోజులు గుర్తు వస్తున్నదన్నారు. ఆ స్పూర్తి కనిపిస్తున్నదని రసమయి బాలకిషన్ కూడా అలయ్ బలయ్ పేరిట తన పాట పేరిట కాంగ్రెస్ మీద పోరాటానికి ఆయుధం విసిరిండు రసమయి అన్నారు. ఉద్యమ సయమంలో దూందాం పేరిట ఎంతో జాగృతం చేసిండని అన్నారు.

- Advertisement -

మరోసారి రైతులను, ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మీద పోరాటానికి మరో ధూంధాం మొదలుపెట్టే రోజులు వచ్చినయని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకు వచ్చి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు.

కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ బతుకమ్మ పండుగ వేల చీరెలు ఇచ్చిండు. కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు ఇచ్చిండు, చెరువుల్లో చేపలు వేసిండు. గొర్రెలు ఇచ్చిండు .కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయని అన్నారు. పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చిందన్నారు.

నేడు 10వేలు, రేపయితే 15వేల రైతు భరోసా అన్నారు. ప్రజలు నమ్మితే నట్టేట ముంచారన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఆపలేదు. మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ రైతులకు రైతు బంధు ఇచారన్నారు. ఇప్పుడు కరోనా లేదు ఎందుకు రైతు బంధు పడలేదు. 15వేలు పడలేదు, కేసీఆర్ ఇచ్చే పది వేలు పడలేదు రైతులను ఘోరంగా మోసం చేశారన్నారు. అందుకే రేవంత్ రెడ్డి మీద అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

మోసం చేసినా కాంగ్రెస్ ను రైతు బంధు కింద కేసీఆర్ 11 విడతల్లో 72వేల కోట్ల రూపాయలుఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డిని ఏం చేద్దామన్నారు. మహిళలకు 2500 ఇవ్వలేదు, బతుకమ్మ చీరెలు అన్నడు, 500 ఇస్తడు అన్నడు ఏది ఇవ్వలేదన్నారు. వృద్ధులకు 4వేల పింఛన్ ఇస్తా అని మాట తప్పిండు ఇచ్చే రెండు వేల పింఛన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు. ఇప్పటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు ఒక్కో పంచాయతీ సెక్రెటరీ లక్షకు పైగా అప్పుల పాలయ్యిండని అన్నారు. పండుగకు బుగ్గలు పెట్టేందుకు పైసలు లేని పరిస్థితి.రుణమాఫీ,లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది పెద్ద మోసం అన్నారు. నిరుద్యోగ యువత పై అరాచకం చేస్తున్నారు.బందిపోట్లు, కిరాతకులు, దొంగలను కొట్టినట్లు నిరుద్యోగులను ఇష్టం ఉన్నట్లు కొడుతున్నారన్నారు.

జీవో 29 రద్దు చేయాలంటే ఎందుకు చేయడం లేదురాజ్యాంగం ప్రకారం రావాల్సిన అవకాశాలను ఎందుకు అడ్డుకుంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మానకొండూరులో బీఆర్ఎస్ వాళ్లే గెలుస్తారు. కాళేశ్వరం ద్వారా 38లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయన్నారు. లక్ష కోట్లు కాని కాళేశ్వరంపై అవినీతి జరిగిందని బురద జల్లారు. ప్రజల తరుపున పోరాటం చేస్తాం అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు.

నామీద కేటీఆర్ మీద బుల్‌డోజర్లు ఎక్కిస్తా అంటున్నడు. చంపుతా అంటున్నాడు. నువ్వు చంపుతానన్న, కేసులు పెడతానన్న అరెస్టులు చేస్తామన్నా బయపడేది లేదమన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. పేదలకు అన్యాయం జరిగితే దేనికైనా మేం సిద్ధం, చావడానికి అయినా సిద్ధమని హెచ్చరించారు. మళ్లీ కేసీఆర్ పాలన తెచ్చే వరకు అందరం కలిసి పోరాటం చేద్దామని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలాకిషన్, మాజీ ఎమ్మెల్సి నరదాసు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ సూడా చైర్మన్ జీవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement