Thursday, July 4, 2024

TG – చివరి దశకు టీపీసీసీ చీఫ్ కసరత్తు .. మ‌ధుయాష్కి వైపే మొగ్గు..

తెలంగాణ పిసిసి కొత్త అధ్య‌క్షుడి నియామ‌క క‌స‌ర‌త్తు చివ‌రి అంకానికి చేరుకుంది. కొత్త అధ్య‌క్షుడి ఎంపిక‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్డి ల్లీలో ఉన్న‌ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ లతో చ‌ర్చిస్తున్నారు… తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అనే అంశంపై ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

మధుయాష్కి వైపే మొగ్గు..


పిసిపి ప‌ద‌వి రేసులో మ‌హేష్ కుమార్ గౌడ్, మ‌ధుయాష్కిలో ఉన్న‌ట్లు స‌మాచారం.. ఇందులో మ‌ధుయాష్కి వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్న‌ట్లు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.. సామాజిక సమీకరణాలతో పాటు సీనియార్టీ, సమగ్రవంతమైన నాయకుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇవాళ కొత్త పీసీసీ పేరు ఖరారు అవుతుందా లేదా ఇంకా టైమ్ పడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.

మంత్రి వర్గ విస్తరణపై కూడా..

- Advertisement -

అలాగే మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసే యోచనలో ఉంది. . ఇక.. హస్తినలోనే ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. కేబినెట్ లో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాలా.. లేదా కొన్నింటిని పెండింగ్ లో ఉంచాలా అన్న దానిపై మంతనాలు సాగుతున్నాయి. ఇక.. మంత్రి మండలి కూర్పు, కాంగ్రెస్ లో చేరికల అంశం భేటీలో చర్చకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement