ప్రభన్యూస్: న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ నుంచి రాహుల్ దూరమయ్యాడు. క్లాసిక్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరమవడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ జట్టులోకి వచ్చాడు. ఫామ్‌లో ఉన్న రాహుల్ సిరీస్ ముంగిట గాయంతో టెస్టుకు దూరమవడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రాహుల్ దూరమైన విషయాన్ని బీసీసీఐ నిన్న వెల్లడించింది. రేపటి నుంచి రెండు టెస్టుల సిరీస్‌లోని తొలి టెస్టు ప్రారంభం కానుంది. రాహుల్ ఎడమ తొడ కండరాల సంబంధిత గాయంతో బాధపడుతున్నాడని సమాచారం. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు దూరంగా ఉండటంతో అతడి స్థానంలో అజింక రహానె సారథ్యం వహించనున్నాడు. రోహిత్‌శర్మ కూడా దూరమవడంతో భారత్ విజయావకాశాలుపై వీరి ప్రభావం పడనుంది.
అయితే ముంబైలో జరగనున్న రెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు. కానీ టీ20 కెప్టెన్ రోహిత్‌శర్మ మొత్తం టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోనున్నాడు. వచ్చే నెలలో జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటనకు అందుబాటులో ఉండేందుకు రాహుల్ ఎన్సీఎలో పునరావాసం పొందనున్నాడు. 29ఏళ్ల రాహుల్ ఇప్పటివరకు 40టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 35.16 సగటుతో 2,231 పరుగులు చేశాడు. 2016లో ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 199పరుగులు రాహుల్‌కు అత్యధిక స్కోరు.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. 3-0 తేడాతో పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై టీమిండియా దృష్టి సారించింది. రేపు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు కాన్పూర్ వేదికగా జరగనుంది. ఈనేపథ్యంలో భారతజట్టు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. కొత్తగా హెడ్ కోచ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రవిడ్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ కానుంది. భారత జట్టు ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసింది.
భారత టెస్టు జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పుజారా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్‌గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital