టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు లంచ్ బ్రేక్ టైమ్ వరకు బాగానే ఆడిని న్యూజిలాండ్ బ్యట్స్‌మన్ ఆ తర్వాత చేతులెత్తేశారు. ఒక్క టామ్ లాథమ్ మాత్రం ఇండియా బౌలర్లకు కొరకరానికి కొయ్యగా మారి 282 బాల్స్ ఆడి.. 95 పరుగులు చేశాడు. ఆ తర్వాత అక్సర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్సెమన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 107 ఓవర్లలో 233 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ చిక్కుల్లో పడింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా..345 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. కాగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్, విల్ యంగ్ దూకుడుగా ఆడారు. వికెట్ పడిపోకుండా టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. మూడోరోజు ఉదయం నుంచి కూడా దూకుడుమీదున్న న్యూజిలాండ్ లంచ్ బ్రేక్ టైమ్‌లో విల్ యంగ్ వికెట్ కోల్పోవడంతో పతనం ప్రారంభమైది. ఆ తర్వాత వరుసగా వచ్చిన బ్యాట్స్‌మన్ ఒక్కొక్కరు పెవిలియన్ బాటపట్టడంతో ఇండియన్ బౌలర్లుగా దాడి పెంచారు. ఈ క్రమంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలుత విల్ యంగ్ వికెట్ తీసి న్యూజిలాండ్ వెన్నువిరవగా.. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్, అక్సర్ పటేల్‌లు దూకుడు పెంచారు. కాగా, అశ్విన్, ఉమేశ్ చేరో వికెట్ తీయగా.. అక్సర్ పటేల్ మాత్రం 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ ను భారీ దెబ్బ కొట్టాడు.
అయితే.. మ్యాచ్ ఇంకా కొనసాగుతోంది ప్రస్తుతం 109 ఓవర్లకు 236 పరుగులతో న్యూజిల్యాండ్ బ్యాటింగ్ చేస్తోంది..
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..