Tuesday, November 26, 2024

Breaking: టెస్లా కార్లలో సాఫ్ట్​వేర్​ లోపం.. 26వేల కార్లు రీకాల్​ చేసిన కంపెనీ..

టెస్లా కంపెనీకి చెందిన కార్లలో సాఫ్ట్​వేర్​ ఎర్రర్స్​ తలెత్తడంతో 26, 681 కార్లను రీకాల్​ చేస్తున్నట్టు తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ లోని వాహనాలను కంపెనీకి తీసుకురావాలని టెస్లా కోరింది. సాఫ్ట్ వేర్ లోపం వల్ల విండ్‌షీల్డ్ డీఫ్రాస్టింగ్ పనితీరు తగ్గుతోందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ఇవ్వాల తెలిపింది. హీట్ పంప్‌లోని వాల్వ్ అనుకోకుండా తెరిచుకుంటోందని.. ఈ లోపం కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయని టెస్లా కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఓవర్-ది -ఎయిర్ సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌ను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement