జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లా గోపాల్పొరా ప్రాంతంలో హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. మృతురాలిని రజనీ భల్లాగా గుర్తించారు. రజనీ జమ్మూ డివిజన్లోని సాంబా జిల్లా నివాసి. కాల్పులకు తెగబడ్డ వారిని త్వరలోనే గుర్తించి, మట్టుబెడుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement