సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. స్వతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులకి తెగబడ్డారు. రాజౌరీలోని ఆర్మీ బేస్ క్యాంప్‌పై ముష్కరులు ఆత్మాహుతి దాడి చేశారు. దీంతో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లో ఉన్న సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.
గురువారం వేకువజామున ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ దాటుకుని లోపలకు చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బేస్‌క్యాంప్ పరిసర ప్రాంతాల్లో ఇంకెవరైనా ఉన్నారనే అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి-అమరులైన ముగ్గురు జావాన్లు -ఐదుగురికి గాయాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement