Tuesday, November 26, 2024

టెర్రర్ ఫండింగ్.. కాశ్మీర్ వేర్పాటువాదులపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌తో సహా పలువురు కాశ్మీరీ వేర్పాటువాదులపై యూఏపీఏలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు ఆదేశించింది. NIA ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పర్వీన్ సింగ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2017లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలను కుట్ర కోణంలో బాగా ప్లాన్ చేశారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ను, దాని ఏజెన్సీలను ఉగ్రవాద నిధుల కోసం ఉపయోగించుకున్నారని.. దౌత్య కార్యకలాపాలను కూడా ఇందుకోసం ఉపయోగించుకున్నారని కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని పాటియాలా హౌస్‌లోని ప్రత్యేక NIA కోర్టు LeT వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, మసరత్ ఆలంతో పాటు ఇతర 15 మంది కాశ్మీరీ వేర్పాటువాద నాయకులపై అభియోగాలను రూపొందించాలని ఎన్ఐఏ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement