టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చింది. దీని రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని టెరిటరీ ఆర్మీ ప్రకటించింది. ఈ జూన్25 నుండి జులై 1వ తేదీ మధ్యలో రిక్రూట్‌మెంట్‌కు చెందిన పలు అంశాలను పేపర్లలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేస్తోంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు www.joinerritorialarmy.gov.inలో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెరిటోరియల్ ఆర్మీ రిజిస్ట్రేషన్ విండో జూలై 1వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇక.. దరఖాస్తుదారులు రాత పరీక్ష కోసం లెటర్ వస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2022లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని పరిశీలిస్తూ ఉండాలని అధికారులు తెలిపారు.
టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు
- టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ – 01 జులై 2022
- టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ – 30 జూలై 2022
- టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ పరీక్ష తేదీ – సెప్టెంబర్ 2022
టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీ వివరాలు
- పురుషులు – 12
- స్త్రీ – 01
టెరిటోరియల్ ఆర్మీ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
1) టెరిటోరియల్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – www.jointerritorialarmy.gov.in కి లాగిన్ కావాలి
2) ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి..
3) వివరాలను పూరించాలి
4) దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేస్తున్నప్పుడు పరీక్ష కేంద్రం ఎంపిక గురించి జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి
5) చివరగా సబ్మిట్ పై క్లిక్ చేయాలి
అప్లికేషన్ ఫీ..
అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 200/-
వయో పరిమితి : 18 నుండి 42 సంవత్సరాలు
విద్యా అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ.
ఎంపిక ప్రక్రియ : సంబంధిత టెరిటోరియల్ ఆర్మీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ నుండి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డ్ (PIB) ద్వారా స్క్రీనింగ్ (రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించబడుతుంది) చేయబడుతుంది.
టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ జీతం :
- మ్యాట్రిక్స్ లెఫ్టినెంట్ రూ. 56,100 –1,77,500
- కెప్టెన్ రూ. 61,300 –1,93,900
- మేజర్ రూ. 69, 400 – 2,07,200
- లెఫ్టినెంట్ కల్నల్ రూ. 1,21,200 – 2,12,400
- కల్నల్ రూ. 1,30,600 – 2,15,900
- బ్రిగేడియర్ 1,39,600 – 2,17,600