తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మారింది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్షల టైం టేబుల్ :
మే 23(సోమవారం) – ఫస్ట్ లాంగ్వేజ్, మే 24(మంగళవారం) – సెకండ్ లాంగ్వేజ్, మే 25(బుధవారం) – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్), మే 26(గురువారం) – గణితం,
మే 27(శుక్రవారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, మే 28(శనివారం) – సాంఘిక శాస్త్రం, మే 30(సోమవారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1,
మే 31(మంగళవారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, జూన్ 1(బుధవారం) – ఎస్ఎస్సెసీ ఒకేషనల్ కోర్సు(థియరీ). ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital