కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్వర్వుల్లో పేర్కొంది. కొవిడ్ కారణంగా పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించి జీవో జారీ చేసింది. టెన్త్ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది. జూన్ రెండో వారంలో సమీక్షించి రెండో సంవత్సర పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, బ్యాక్‌లాగ్ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్ మార్కులు వేస్తామని గతంలో ప్రభుత్వం తెలిపింది.
పదోతరగతి విద్యార్థులందరు పాస్: తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
Advertisement
తాజా వార్తలు
Advertisement