పదవ తరగతి 2021-22 విద్యా సంవత్సరం పరీక్షలు రాయబోయే విద్యార్థులు పరీక్ష ఫీజు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెల్లించుటకు ఫిబ్రవరి 14 వరకు ప్రవేశ గడువు పొడిగించినట్లు జయశంకర్ జిల్లా విద్యాశాఖ అధికారి బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి బానోతు జుమ్ము ఒక ప్రకటనలో తెలియజేశారు. 50 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 24వ తేదీ వరకు,200 రూపాయల అపరాధ రుసుముతో మార్చి 4వ తేదీ వరకు, 500 రూపాయల అపరాధ రుసుంతో మార్చి 14 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలియజేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల విద్యార్థులతో సకాలంలో ఫీజు చెల్లించి విద్యార్థులందరూ పదవతరగతి పరీక్షలు వ్రాసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.