ఆపిల్ తన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే.. చైనా, తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో యాపిల్ టెక్ దిగ్గజానికి కొన్ని అవాంతరాలు ఏర్పడే చాన్సెస్ ఉన్నాయంటున్నారు టెక్ ఎక్స్పర్ట్స్. లాంచ్ చేయబోయే ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల తయారీలో కాస్త లేట్ అయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల వాటి తయారీలో ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ఇక.. ట్విట్టర్లో ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కువో తన సర్వేలో “ఐఫోన్ 14 మోడల్స్ సరఫరా విషయంలో ఎటువంటి ప్రభావం ఉండదని” తెలిపారు.
ఐఫోన్ 14 మోడల్స్ ఉత్పత్తి, షిప్మెంట్ షెడ్యూల్ విషయంలో తాజాగా నెలకొన్న కొన్ని పరిస్థితులు ఎఫెక్ట్ చూపుతాయని కొంతమంది పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఐఫోన్ 14 మోడల్‌ల సరఫరాపై ప్రస్తుతం ఎటువంటి ప్రభావాలు లేవని తన తాజా సర్వేలో వెల్లడయ్యిందని కువో ట్వీట్ చేశారు. చైనా, తైవాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా లాంచ్ కాబోయే ఐఫోన్ 14 ఆలస్యం అవుతుందని గత వారం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. భారతదేశంలోని ఫాక్స్ కాన్ సంస్థ ఐఫోన్ ఉత్పత్తి సైట్ 2022 ద్వితీయార్థంలో చైనాతో పోటీగా కొత్త 6.1-అంగుళాల ఐఫోన్ 14ను రవాణా చేస్తుందని కువో చెప్పారు. అంతేకాకుండా 2023లో AirPods USB-C ఛార్జింగ్ కేసులను కూడా పొందవచ్చని అంచనా వేశారు.
ఆపిల్ 2023లో అన్ని AirPods మోడల్‌ల కోసం USB-C-సామర్థ్యం గల ఛార్జింగ్ కేసులను లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు టెక్ ఎక్స్పర్ట్స్. జులైలో సెకండ్ జనరేషన్ Apple AirPods ప్రో ఎటువంటి ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉండదని, వెదర్ లేదా హార్ట్ రెస్పాన్స్ గుర్తింపుతో అందించబడదని ఒక నివేదిక పేర్కొంది. ఇక.. Apple ఎయిర్‌పాడ్స్ విషయంలో నెక్ట్స్ లెవల్లో ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది.