Friday, November 22, 2024

Apple Iphone: చైనా, తైవాన్​ మధ్య ఉద్రిక్తలు.. ఐఫోన్​ 14 తయారీపై ప్రభావం ఉంటుందా? 

ఆపిల్ తన నెక్ట్స్​ జనరేషన్​ ఐఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే.. చైనా, తైవాన్​ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో యాపిల్​ టెక్ దిగ్గజానికి కొన్ని అవాంతరాలు ఏర్పడే చాన్సెస్​ ఉన్నాయంటున్నారు టెక్​ ఎక్స్​పర్ట్స్​. లాంచ్​ చేయబోయే ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్​ ఫోన్ల తయారీలో కాస్త లేట్​ అయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల వాటి తయారీలో ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ఇక.. ట్విట్టర్‌లో ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కువో తన సర్వేలో “ఐఫోన్ 14 మోడల్స్ సరఫరా విషయంలో ఎటువంటి ప్రభావం ఉండదని” తెలిపారు.

ఐఫోన్ 14 మోడల్స్ ఉత్పత్తి, షిప్‌మెంట్ షెడ్యూల్ విషయంలో తాజాగా నెలకొన్న కొన్ని పరిస్థితులు ఎఫెక్ట్​ చూపుతాయని కొంతమంది పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఐఫోన్ 14 మోడల్‌ల సరఫరాపై ప్రస్తుతం ఎటువంటి ప్రభావాలు లేవని తన తాజా సర్వేలో వెల్లడయ్యిందని కువో ట్వీట్ చేశారు. చైనా, తైవాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా లాంచ్​ కాబోయే ఐఫోన్ 14 ఆలస్యం అవుతుందని గత వారం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. భారతదేశంలోని ఫాక్స్ కాన్ సంస్థ ఐఫోన్ ఉత్పత్తి సైట్ 2022 ద్వితీయార్థంలో చైనాతో పోటీగా కొత్త 6.1-అంగుళాల ఐఫోన్ 14ను రవాణా చేస్తుందని కువో చెప్పారు. అంతేకాకుండా 2023లో AirPods USB-C ఛార్జింగ్ కేసులను కూడా పొందవచ్చని అంచనా వేశారు.

ఆపిల్ 2023లో అన్ని AirPods మోడల్‌ల కోసం USB-C-సామర్థ్యం గల ఛార్జింగ్ కేసులను లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు టెక్​ ఎక్స్​పర్ట్స్​.  జులైలో సెకండ్​ జనరేషన్​ Apple AirPods ప్రో ఎటువంటి ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను కలిగి ఉండదని, వెదర్​ లేదా హార్ట్​ రెస్పాన్స్​ గుర్తింపుతో అందించబడదని ఒక నివేదిక పేర్కొంది. ఇక.. Apple ఎయిర్​పాడ్స్​ విషయంలో నెక్ట్స్​ లెవల్​లో ఆడియో ఎక్స్​పీరియన్స్​ని  మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement