Tuesday, November 19, 2024

టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ.. మల్కాజిగిరిలో టెన్షన్ వాతావరణం

 పోలీసుల బందోబస్తు మధ్య మల్కాజిగిరి లో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. 

బీజేపీ కార్పొరేటర్‌పై దాడికి నిరసనగా బీజేపీ పిలుపునిచ్చిన బంద్ తో మల్కాజిగిరిలో ఉద్రిక్త పరిస్థితిలు ఉన్నాయి. మల్కాజిగిరిలో టెన్షన్ వాతావరణ నెలకొంది. పోలీసుల బందోబస్తు మధ్య మల్కాజిగిరి లో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా అందరూ బంద్ లో పాల్గొనాలని బీజేపీ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు.

కాగా, మల్కాజ్‌గిరిలో పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జెండా ఆవిష్కరణ జరుగుతోన్న సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కార్పొరేటర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.

బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడి చేశారన్న అభియోగంతో పోలీసులు ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 307, 323, 324, 143, 147, 149 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. మైనంపల్లి సహా మరో 15 మంది కార్యకర్తలపై కేసు నమోదు అయింది.

పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మూకుమ్మడిగా తమపై దాడి చేశారని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్‌ ఊరపల్లి శ్రావణ్‌ ఆరోపించారు. జెండా వందనం సందర్భంగా ఆదివారం జాతీయ జెండాను ఎగురవేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను నమస్తే అన్నా మర్యాదగా పలకరిస్తే… టీఆర్‌ఎస్‌ నేతలు రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. తనను రక్షించేందుకు యత్నించిన బీజేపీ కార్పొరేటర్లు గున్నాల సునీతాయాదవ్‌, రాజ్యలక్ష్మిని చీరలను పట్టుకొని లాగి, తొసేసి దుర్భాషలాడి, బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ గుండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యే అవినీతి, అతడి అనుచరుల అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించడంతో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందువల్లనే నాపై ఎమ్మెల్యే కక్ష కట్టారని శ్రావణ్ పేర్కొన్నారు.

- Advertisement -

మరోవైపు తమ జోలికి వస్తే తిరిగి దాడి చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి బీజేపీ నాయకులను హెచ్చరించారు. మల్కాజిగిరిలో ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ నాయకులు కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ జోలికి వస్తే చేతులు కట్టుకుని కుర్చోమని.. తిరిగి దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: హుజూరాబాద్ గడ్డపై చారిత్రక ఘటం.. నేడే ‘దళిత బంధు’ శ్రీకారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement