కరీంనగర్ తలాపున నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కీలకమైన టెండర్ల ప్రక్రియ ముగిసింది. రూ.308 కోట్ల పనులకు సంబంధించిన పనుల నిర్మాణ ఒప్పదం దాదాపుగా పూర్తయింది. మార్చి మొదటి వారంలో ఇందుకు సంబంధించిన నిర్మాణపు పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఐదేళ్ల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ దిగువ మానేరు జలాశయం చెంతన సుందరమైన పర్యాటక ప్రాంతాన్నిఆహ్మాదాబాద్ లోని సబర్మతి తరహాలో నిర్మించాలనే తలంపును తెలియజేశారు. జిల్లాకుచెందిన మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా చొరవ చూపించి నిధుల్ని రాబట్టడంతోపాటు నీటిపారుదల, పర్యాటక శాఖలను సమన్వయపరుస్తూ పలు సమీక్షలతో ప్రగతి సాకరమయ్యేందుకు తనవంతు కృషిని చూపించారు.
మొదటి అంచెలో భాగంగా రూ. 308కోట్లతో కీలకమైన ప్రాథమిక దశలోని పలునిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఎల్ఎండీ గేట్ల నుంచి దిగువనకు ఉన్న నీటి ప్రవా హానికి ఇరువైపుల భారీ ప్రహరీలను నీటి అడుగు నుంచి నిర్మించబోతున్నారు. 10 కి.మీ దూరం నిర్మించే ఈ మానేరురివర్ ఫ్రంట్ లో ప్రాధాన్యం గల ఈ పనులను మార్చి మొదటి వారంలో ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే పూర్తయిన సమగ్ర ప్రగతి నివేదిక ఆధారంగాఇక్కడ నిర్మాణాల్నిచేపట్ట బోతున్నారు. ముందుగా ప్రస్తుతం ఉన్న అలుగునూర్ బ్రిడ్జి నుంచి ఎల్‌ఎండీ గేట్ల వైపునకు 200 మీటర్ల నుంచి ఇరువైపులప్రహరీలనునిర్మించబోతున్నారు. ఇక్కడ 300 మీటర్ల మేర ఎత్తు నీళ్లు నిలిచి ఉండేలా ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ఇప్పుడున్న అడుగు భాగాన్ని అవసరమైన చోట చదును చేయడంతోపాటు 3మీటర్ల లోతుకు చదును చేస్తారు. నేల కింది భాగం నుంచి 16 అడుగుల ఎత్తువరకు గోడల నిర్మాణాలు ఇరువైపుల ఉంటాయి. వీటిని ఆనుకుని మొదటి దశలో ఇరువైపుల 8 అడుగుల నిర్మాణాన్ని పర్యాటకులు వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. నీటి మట్టం నుంచి రెండు దిక్కుల 4.8 మీటర్ల ఎత్తులో పాదచారులు నడిచేందుకు.. పర్యాటకులు కూర్చుని వీక్షించేందుకు బెంచీలను ఏర్పాటు చేస్తారు. ఇలా అలుగునూర్ వంతెన నుంచి తీగల వంతెన దాటిన కొద్దిదూరం వరకు 2.3 కి.మీ మేర ఇలా నిర్మాణ పనులు చేపట్టనున్నారు..
ఎల్ఎండీ దిగువన 10 కి.మీ మేర నీళ్లు నిలబడి అందమైన ప్రాంతంగా మార్చేందుకే ఈ మానేరు రివర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో ఈ నిర్మాణాల తరువాత ఇరువైపుల హోటళ్ల నిర్మాణాలు,బృందావనాల ఏర్పాటుతోపాటు వాటర్ ఫౌంటేన్లు.. ఇతరత్రా సుందరమైన నిర్మాణాల్ని పర్యాటకులు వీక్షించేలా చేపట్టబోతున్నారు. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ సహా అధికారుల బృందం సబర్మతిని సందర్శించారు. అక్కడ ఉన్న నమూనాలకు భిన్నంగా ఇక్కడి ప్రాంతాన్ని నిర్మించేలా సరికొత్త నిర్మాణశైలిని రివర్‌ఫ్రంట్‌కు అనుసంధానించబోతున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంరూ.410 కోట్లు కాగామొదటి దశలో రూ. 308 కోట్లతో టెండర్లుపూర్తయ్యాయి. మిగతా రూ. 102 కోట్ల పనులను పర్యాటక శాఖ పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. మొదటి దశలో నిర్మించేచోట ఎన్ఎండీ చెంతన 300 మీటర్ల వెడల్పుతో.. ప్రారంభమయ్యే నీటి నిల్వప్రాంతం 10 కి.మీ దూరానికి వెళ్లే సరికి 400 మీటర్ల ప్రాంతంగా మారనుంది. అక్కడ నీటిని నిలిపేందుకు వీలుగా సరికొత్త తరహాలో చెక్ డ్యామ్ మరియు 4 గేట్లతో బ్యారేజీని నిర్మించనున్నారు. సగం మేర అంటే 210 మీటర్ల దూరం బ్యారేజీ.. దానికి ఆను కుని 190 మీటర్ల గోడతో కూడిన చెక్ డ్యామ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇరువైపుల పలుచోట్ల నీటిని తాకేలా మెట్లను కూడా నిర్మాణమవుతాయి. మార్చి నెలలో ప్రారంభించే పనులను దాదాపుగా ఆర్నెళ్లలో పూర్తి చేసే అవకాశం ఉంది.