Tuesday, November 26, 2024

న్యాయ రాజధాని అంశానికి తాత్కాలిక బ్రేక్‌.. జ‌గ‌న్ స‌ర్కారు ఏం చేయ‌బోతోంది?

కర్నూలు, ప్రభన్యూస్ : అనుకుందే జరిగింది. ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏపి శాసన సభలో బిల్లును ప్రవేశ పెట్టి వాటిని ఆమోదింప చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఒక్కసారిగా న్యాయవాదులకు దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా జిల్లాలో బార్‌ అసోషియేషన్‌ నేతల్లో ఆందోళన నెలకొంది. హైకోర్టుపై పెట్టుకున్న ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయిందని వ్యాఖలు ఎదురయ్యాయి. తక్షణమే ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని, హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి నుంచి రీ నోటిఫికేషన్‌ ఇప్పించాలని, లేనిపక్షంలో ప్రత్యేక రాయ‌ల‌సీమ రాష్ట్రంను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఎదురయ్యాయి.

అయితే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలనే తమ పార్టీ డిక్లరేషన్‌ మేరకు కట్టుబడి ఉన్నామని బీజేపీ ప్రకటించగా, అయితే ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా శ్రీబాగ్‌ ఒడంబడికను ఉదహరిస్తూ పాలన వికేంద్రీకరణ క్రమంలో రాయలసీమకు, అదే విధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు మిగిలిన ఏపీ జిల్లాలకు సమ న్యాయం జరిగేలా న్యాయమైన ఇబ్బందులు లేకుండా నూతన పాలన వికేంద్రీకరణ చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారగా. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. 1956లో అసలే రాజధానిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కర్నూలు ప్రజలకు ముఖ్యమంత్రి ప్రకటన అప్పట్లో ఊరట ఇచ్చింది. ఆ మేరకు పరిపాలన వికేంద్రికరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ముందుగా మంత్రి వర్గంలో, ఆ తర్వాత శాసన సభలో ఆమోదించారు గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ వెనువెంటనే జారీ చేశారు. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో కర్నూలు న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటాలకు పాలభిషేకం నిర్వహించారు.

ఇదే సమయంలో కర్నూలులో న్యాయరాజధానిని జగన్నాథ గట్టుపై ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ప్రకటించారు. ఇందుకోసం 250 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా కర్నూలు చుట్టు పరిసర ప్రాంతాలలో రియల్‌ వ్యాపారం జోరందుకుంది. ఇదే క్రమంలో ఓర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటు చేయడం, ఇదే ప్రాంతం మీద పారిశ్రామిక కాడర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన వెలువడటం ఒక్కసారిగా యావత్‌ కర్నూలు ప్రజలనే కాకుండా సీమ ప్రాంత ప్రజలను ఆనందింప చేసింది. రాళ్లసీమయైన కర్నూలులో న్యాయ వ్యవస్థ ఏర్పడనుందని, ఈలోగా రెండేళ్లు గడిచిపోయాయి. ఈ బిల్లుల చట్టబద్ధత లేదని కర్నూలులో న్యాయరాజధాని అంశం హైకోర్టుకు చేరింది. స్టేటస్‌ కో ఉత్తర్వుల నేపథ్యంలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు ప్రకియకు అటంకం ఏర్పడింది. దీంతో కర్నూలులో న్యాయ రాజధాని అంశం రెండేళ్లుగా మురుగుతూ వచ్చింది. అంతేకాదు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల సమ్మతితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి అవసరం ఉంది.

కర్నూలులో హైకోర్టు అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశం కానే కాదని, రాష్ట్రపతి ఆమోదిస్తే, కేంద్ర ఆమోద ము ద్రతో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్రపడాల్సి ఉంది. అప్పుడు కాని కర్నూలుకు హైకోర్టును అమరావతి నుంచి తరలించే అవకాశం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రటకన చేయడం, తాజాగా రాజధాని వ్యాజాలపై విచారణ నిర్వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖలు చేయడం కలకలం రేపింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అన్న ప్రభుత్వ నిర్ణయం ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం ముందని, అసలు న్యాయ రాజధాని అంటే ఏమిటీ, పాలన వికేంద్రికరణ చట్టంలో కర్నూలులోనే హైకోర్టు ఉండాలనే స్పష్టత లేదని, హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలోనే ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారని, కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికి పోదని, అలాంటప్పుడు హైకోర్టు లేకుండా కర్నూలులో న్యాయరాజధాని ఎలా సాధ్యమని, రాజు లేకుండా రాజధాని సాధ్యమవుతుందన్న తీరులో హైకోర్టు వ్యాఖలు వెలువడ్డాయి.

ఈ క్రమంలో ప్రభుత్వ పాలన వికేంద్రీకరణకు చేపట్టిన చట్టాన్ని రద్దు చేయడం, శాసన సభలో బిల్లును ప్రవేశపెట్టి సభలో ఆమోదింప చేయడం అన్నీ చకచక జరిగిపోయాయి. కాగా శ్రీబాగ్‌ ఒడంబడికను పేర్కొంటూ పాలన వికేంద్రీకరుణ ద్వారా రాయలసీమకు, అదే విధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు, మిగిలిన ఏపీ జిల్లాలకు సమ న్యాయం జరిగేలా న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా నూతన పాలన వికేంద్రీకరణ చట్టం తీసుకొస్తామని సీఎం ప్రకటించడం వెనుక మర్మమేమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలో ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ సమ గ్రాభివృద్ధికి పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ అత్యంత అవసరం అంటున్న ప్రభుత్వ వాదనతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నా మని, ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ చట్టంతో సంబంధం లేకుండా హైకోర్టు ప్రధాన కేంద్రంను కర్నూలులో ఏర్పాటులకు రాష్రపతి నుంచి రీ నోటిఫికేషన్‌ తీసుకొని రావడానికి వైసీపీ ప్రభుత్వం కార్యచరణ తక్షణమే చేపట్టాలని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా ధశరథ రామిరెడ్డి కోరారు.

- Advertisement -

పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అభివృద్దికి ముందడుగు వేస్తున్న ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేనిపై విధాన పరమైన నిర్ణయాలతో క్రియాశీలక కార్యాచరణ రూపొందించా లని కోరారు. కర్నూలులో హైకోర్టు, రా,సీమ ప్రాజెక్టుల సంరక్ష ణకు కర్నూలు డిక్టేరేషన్‌ చేసిన బీజేపీ, డిక్లరేషన్‌ అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. హైకోర్టు ఏర్పాటు డిక్టరేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉంది .కర్నూలులో హైకోర్టు పెట్టాలని బిజెపి డిక్లేరేషన్‌లో ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్‌బాబు ప్రకటించారు. రాయలసీమ డిక్లేరేషన్‌పై బీజేపీ కట్టుబడి ఉంది. హైకోర్టు ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం రెండు నాల్కల దోరణితో వ్యవహారిస్తుంది. ఈ విషయంలో రా,సీమలో వైసీపీ నాయకులకు నోరుమెదిపే ధైర్యం లేదన్నారు. వెనుకబడిన రా,సీమను రతనాల సీమగా మార్చే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement