Monday, November 18, 2024

Weather | ఐదు రోజులపాటు భ‌గ‌భ‌గ‌లు.. టెంప‌రేచ‌ర్లు పెరుగుతాయన్న ఐఎండీ

స‌మ్మ‌ర్ హీటెక్కిస్తోంది. ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ టెంప‌రేచ‌ర్లు పెరిగిపోతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక‌.. రాబోయే మూడు నుంచి ఐదు రోజుల‌పాటు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో గరిష్ఠ స్థాయిలో టెంప‌రేచ‌ర్లు న‌మోద‌వుతాయ‌ని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈశాన్య భారతం, పశ్చిమ హిమాలయ ప్రాంతం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో హ‌య్యెస్ట్ టెంప‌రేచ‌ర్లుంటాయ‌ని చెప్పింది.

అయితే.. ఇదే స‌మ‌యంలో హీట్‌వేవ్స్ ఉండే చాన్స్ లేద‌ని ఐఎండీ తెలిపింది. కాగా, తూర్పు ప్రాంతంలోని ద్రోణి కేరళ నుంచి విదర్భ వరకు ఇంటీరియర్ కర్నాటక, మరాఠ్వాడా మీదుగా తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో ఉందని.. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్ కూడా ఎక్కువే ఉందని చెప్పింది. ఆదివారం సెంట్రల్‌ మహారాష్ట్ర, మరఠ్వాడా, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇక‌.. దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌, కేరళలోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు జ‌ల్లులుంటాయ‌ని ఐఎండీ అంచానా వేసింది. మధ్య, తూర్పు భారతదేశంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉండే చాన్స్‌ ఉందని చెప్పింది. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement