తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలోని కొమురంభీం జిల్లాలోని సిర్పూర్(యు)లో 11.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గిన్నెదరిలో 12.1, తిరగయాణిలో 13 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 13.3, పిప్పల్ దరిలో 13.5, పెంబిలో 13.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రలు నమోదయ్యాయి. మెదక్లో 17.3, నిజామాబాద్లో 17.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీలోని మాడుగులలో 8.1 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయింది. పాడేరు, అరుకులలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా ఆవరించడంతో వాహనదారుల రాకపోకల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాబోయే మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital