బెంగళూరు ,ఆంధ్రప్రభ బ్యూరో : కర్ణాటక అసెంబ్లి ఎన్నికల్లో తెలుగు ఓటర్ల తీర్పు కీలకం కానుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు, ఆ పార్టీల తరపున పోటీలో నిలిచిన అభ్యర్థులు తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు మరోవైపు తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్, భాజపా, జనతాదళ్ పార్టీలు పక్కా వ్యూ#హం రచిస్తున్నట్టు సమాచారం. తెలుగు మాట్లాడే ఓటర్ల నియోజకవర్గాలను గుర్తించి అక్కడ తెలుగు వారిని మరీ ముక్యంగా పలుకుబడి ఉన్న నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేసి వారితో నామినేషన్లు వేయించినట్టు తెలుస్తోంది. దీంతో కర్ణాటక అసెంబ్లిd ఎన్నికల్లో తెలుగు మాట్లాడే నేతలకు డిమాండ్ బాగా పెరిగినట్లయింది. ఎన్నికల ప్రచారానికి మరో ఇరవై రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని పార్టీలు, నాయకులు వారి మద్దతు దారులతో గడప గడపకు తిరుగుతూ పోటాపోటీ ప్రచారం నిర్వ#హస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోలో 224 శాసనసభ స్థానాలుండగా 112స్థానాల్లో విజయం సాధించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లిd నియోజక వర్గాల్లో ఏడు జిల్లాల్లో ఉన్న 64 స్థానాల్లో తెలుగు మాట్లాడే ఓటర్లు అరవై శాతానికి పైగా ఉన్నారు. వచ్చే నెల 10న జరిగే అసెంబ్లి ఎన్నికల్లో తెలుగు మాట్లాడే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్న సంకేతాలు వెలువడడంతో రాజకీయ పార్టీలన్నీ తెలుగు ఓటర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల సరి#హద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో ప్రభావం మరింతగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రెండు జాతీయపార్టీలు కాంగ్రెస్, భాజపా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను ప్రచార బరిలోకి దింపాయి. జనతాదళ్ సెక్యులర్ తరపున భారత రాష్ట్ర సమితి(భారాస) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహంచనున్నారు. తెలంగాణకు పొరుగున ఉన్న గుల్బర్గా,రాయచూర్,కొప్పోల్,బీదర్ తో పాటు బెంగళూర్ అర్బన్ లో నిర్వహంచే ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వైపు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు బీదర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం అవుతానని ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్యెల్యేలు.ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు.
తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెనర్ల ఎంపిక
భాజపా,కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కర్ణాటక అసెంబ్లిd ఎన్నికల్లో ప్రచారం నిర్వహంచేందు ప్రచార తారల జాబితాను ప్రకటించింది. భాజపా తరపున పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు, ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్‌తో సహా 20 మంది నేతలను ప్రచారానికి రావాలని పార్టీ ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ తరపున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు
64 స్థానాలలో తెలుగోడి పట్టు…
కర్ణాటక లో 224 అసెంబ్లి సీట్లుండగా ఏడు జిల్లాల్లోని 64 స్థానాల్లో తెలుగు మాట్లాడే ఓటర్లు 60 శాతానికి పైగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కోలార్ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో 76 శాతం తెలుగు ఓటర్లున్నారని సమాచారం. బెంగళూర్ రూరల్ జిల్లాలోని నాలుగు జిల్లాలో 65 శాతం, బెంగళూర్ అర్బన్ జిల్లాలోని 28 నియోజక వర్గాల్లో 49 శాతం తెలుగు మాట్లాడే ఓటర్లున్నారు. రాయచూర్ జిల్లాలో ఏడు సీట్లలో 64 శాతం, బళ్లారిలో 9 అసెంబ్లి సీట్లలో 63 శాతం, చిక్ బల్లాపూర్ జిల్లాలో 5 సీట్లలో 49 శాతం కొప్పల్ జిల్లాలో 5 అసెంబ్లి సీట్లలో 43 శాతం తెలుగు ఓటర్లున్నారని లెక్కలు చెబుతున్నాయి.ఇదిలా ఉండగా జ#హరాబాద్‌కు పొరుగున ఉన్న బీదర్ నియోజక వర్గంలో ఉన్న ఓటర్లలో 20 శాతం మంది సంగారెడ్డి జిల్లాకు చెందిన వారేనని వ్యాపార నిమిత్తం ప్రతి రోజూ బీదర్ వెళ్లి వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.