Wednesday, November 13, 2024

పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం?

ఏపీలో తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని, అందుకే త్వరలో జరిగే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడే అధికార పార్టీ రెచ్చిపోయిందని, ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజార్చడం ఖాయం అని టీడీపీ అభిప్రాయపడుతోంది. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్నీ తాజాగా ఎస్ఈసీగా రావడంతో టీడీపీ పరిషత్ ఎన్నికల సరళిపై ఓ అంచనాకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement