Monday, November 25, 2024

TS: పోటీ పరీక్షల కోసం 15 అకాడమి పుస్తకాలు

తెలంగాణలో 80 వేలపై చిలుకు ఉద్యోగాలకు ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నది. డిమాండ్‌ ఉన్న 15 రకాల పుస్తకాల పునర్ముద్రణకు చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా రూ.20 కోట్లకుపైగా వెచ్చించి తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రిస్తుండగా, ఈ సారి అదనంగా రూ. 5 నుంచి 10 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రూప్‌ -1, గ్రూప్‌  2, పోలీసు, టీచర్‌ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల్లో అత్యధికులు తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఎంపిక చేసుకొంటారు. ఈ పుస్తకాలనే ప్రశ్నపత్రాల రూపకల్పనకు ప్రామాణికంగా తీసుకొంటారన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా పుస్తకాలను అందుబాటులో తీసుకురావాలని అధికారులు కృషిచేస్తున్నారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (పోటీ పరీక్షల ప్రత్యేకం), తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జనరల్‌ స్టడీస్‌ -1, సామాజిక నిర్మితి  వివాదాలు విధానాలు, సైన్స్‌ వంటి పుస్తకాలను ముద్రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement