అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. విమానయాన సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని ఎయిర్ పోర్టు చుట్టూ 5 జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి. మిగిలిన చోట్లు సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. అమెరినా నుంచి వెళ్లే లేదా అమెరినా రావాల్సిన మొత్తం 538 విమానాలు 5జీ సేవలు ప్రారంభమవడం కారణంగా రద్దు కానున్నాయని సమాచారం.
అమెరికాలో బుధవారం నుంచి 5 జీ సేవలు ప్రారంభించినట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీ షెడ్యూల్ చేశాయి. అయితే బుధవారం కేవలం 215 విమానాల మాత్రమే రద్దయ్యాయి. వీటిలో ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ANA, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలున్నాయి. ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్ వేదికగా ప్రకటించింది. 3.7- 3.98 గిగాహెర్ట్జ్ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్, ఏటీ అండ్ టీ లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..