Tuesday, November 26, 2024

టెలి ఓటింగ్ తో ఆప్ పంజాబ్ సీఎం అభ్య‌ర్థి ఎంపిక – కేజ్రీవాల్ వినూత్న నిర్ణ‌యం

కొత్త ప‌ద్ద‌తికి తెర‌లేపారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్య‌ర్థిని ప్ర‌జ‌లే ఎన్నుకునేలా వినూత్న నిర్ణ‌యాన్ని అమ‌లు ప‌రిచారు. సీఎం అభ్య‌ర్థిని ప్ర‌జ‌లే ఎంచుకునేలా ఫోన్ నెంబ‌ర్ ని ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. సీఎంగా ఎవ‌రిని ఎనుకుంటారో ఆ నెంబ‌ర్ కి ఫోన్ చేసి అభ్య‌ర్థి పేరు చెప్పాల‌ని తెలిపారు. ఈ మేర‌కు 7074870748నెంబ‌ర్ కి ఫోన్ చేయాల‌ని చెప్పారు. కాగా కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నానికి దారి తీసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ కూడా ఇటువంటి నిర్ణ‌యాన్ని తీసుకుని ఉండ‌దు.

దేశ చర్రితలోనే సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావొచ్చు.. ఫోన్ చేసి గానీ, వాట్సాప్ లో మెసేజ్ ద్వారా గానీ ప్రజలు అభిప్రాయం చెప్పొచ్చు. జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు ప్రజలు తమ అభీష్టాన్ని చెప్పాల‌న్నారు కేజ్రీవాల్. వాస్తవానికి ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ ఉన్నా ఆయనపై చాలా మంది నేతలు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయంలో కేజ్రీవాల్ స్పందించారు. భగవంత్ మన్ తనకు అత్యంత కావాల్సిన వ్యక్తి అని అన్నారు. తాము ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నా.. ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేద్దామంటూ ఆయనే సలహా ఇచ్చారన్నారు. తలుపులన్నీ మూసేసి నాలుగు గదుల మధ్య సీఎం అభ్యర్థిని నిర్ణయించడం మంచి పద్ధతి కాదంటూ ఆయన కూడా చెప్పారని కేజ్రీవాల్ వెల్ల‌డించారు. మ‌రి ప్ర‌జ‌లు ఎవ‌రిని సీఎం చేయ‌బోతున్నార‌నేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement