Wednesday, November 20, 2024

తెలంగాణలో జూన్ నుంచి కరోనా కేసులు పెరగవు: ఐఐటీ మోడల్

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారి కేసుల సంఖ్య వేలల్లో ఉంది. అయితే, జూన్ నుంచి తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ కంప్యూటేషనల్ మోడల్ గురించి వివరించారు. తెలంగాణలో జూన్ నుంచి కరోనా కేసులు తగ్గుతాయని తెలిపారు. తెలంగాణలో ఊహించిన దాని కంటే కొంచెం అటు ఇటుగా ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఈ మోడల్ ప్రకారం.. మే 20 నుంచి తెలంగాణలో కేసుల లోడ్ అనేది తగ్గుతూ వస్తుందని, కేసులు తగ్గి జూన్ 21 నాటికి ఒకేలా మెయింటైన్ అవుతాయన్నారు. జూన్ 21 నుంచి కరోనా కేసులు పెరగవని కాకపోతే రాష్ట్రంలో మే 12నుంచి 20 వరకూ దారుణంగా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే వైద్యారోగ్య శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం.. కొవిడ్ కేసులు ములుగు జిల్లాలోనే తక్కువగా ఉన్నాయి. ములుగు మినహాయించి ఇతర 17జిల్లాల్లో వారానికి 100 కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. నారాయణ్ పేట్, మెదక్, నిర్మల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ లలో నమోదవుతున్న కేసులు చూస్తుంటే రాష్ట్రంలో కొద్ది చోట్ల మాత్రమే కేసుల నమోదు ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement