Tuesday, November 26, 2024

Telangana | ఎస్​ఐ పోస్టులో ఫిట్​నెస్​ కోసం.. ఓ మహిళా అభ్యర్థిని ఏం చేసిందంటే!

తెలంగాణలో పోలీసు కొలువుల మేళా కొనసాగుతోంది. సబ్​ ఇన్​స్పెక్టర్ పోస్టుల కోసం ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్టులు జరుపుతున్నారు. మహబూబ్​నగర్​లో జరుగుతున్న ఈ ఫిజికల్​ టెస్టుల్లో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా అభ్యర్థి ఎస్​ఐ పోస్టు కోసం పరీక్షలను ఎదుర్కొంటోంది. అయితే.. శారీరక దారుఢ్య పోటీకి వచ్చిన క్రమంలో తాను తగినంత ఎత్తు లేకపోవడంతో ​ హైట్​ పెరిగేందుకు ఎవరూ చేయని సాహసానికి ఒడిట్టింది.

ఆ అభ్యర్థిని తన జుట్టు లోపల ఎం-సీల్ వ్యాక్స్ ను ఉపయోగించి ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్టులకు వచ్చింది. అయితే.. ఆటోమేటిక్‌గా ఎత్తును కొలిచే ఎలక్ట్రానిక్ పరికరం ఆ అభ్యర్థి తగినంత ఎత్తు లేకపోగా, తలలో ఏదో పెట్టుకున్నట్టు గుర్తించింది. ఈ విషయాన్ని అక్కడ ఉన్న  అధికారులు గుర్తించి ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత మహిళా సిబ్బంది ద్వారా క్షుణ్ణంగా విశ్లేషించినప్పుడు ఆమె జుట్టు కింద M-సీల్ మైనపు వంటిది అతికించినట్టు కనుగొన్నారు. ఇక.. ఆమెను అనర్హులుగా ప్రకటించారు. కానీ, అభ్యర్థి ఎవరనేది మాత్రం అధికారులు తెలియజేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement