Saturday, November 23, 2024

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు లేవ్ – దివ్యాంగుల‌కు అండ‌గా ఉంటాం – మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

ముంద‌స్తు ఎన్నిక‌లంటూ మాజీ పీసీసీ క‌ల‌లు కంటున్నార‌ని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. ఇక తెల‌గాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌ని, వ‌ట్టి భ్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. సూర్యపేట జిల్లాలో మంత్రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మహిళా, శిశు,దివ్వాంగులు, వయో వృద్ధుల శాఖా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీలు,ట్రై సైకిల్లు,లాప్ టాప్ లతో పాటు 4జి ఫోన్ లను ఆయన అంద జేశారు. అనంతరం మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివ్వాంగులకు అండగా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. వికలాంగుల తొలుత‌ రూ. 1500 రూపాయల ఫించన్ అందిస్తున్నామ‌ని, రెండో సారి అధికారంలోకి రాగానే వారి ఫించన్ ను రూ. 3000 లకు పెంచిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

దివ్యాంగుల‌కు ఆసరాగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. అంగ వైకల్యతను అధిగమించి మిగతా వారితో పోటీగా అన్ని రంగాలలో వారిని పోటీ పడేలా మానసికంగా సిద్ధపరచడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. అటువంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఉందా అని ఆయన కాంగ్రెస్,బిజెపి లను సూటిగా ప్రశ్నించారు. ప్రధానికి ముందు ఏకధాటిగా 25 ఏండ్లు గుజరాత్ కు సీఎం గా ఉన్నారు, కానీ ఆయ‌న ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయ‌లేద‌ని అన్నారు.మోడీ పాల‌న‌లో ఎలాంటి సంక్షేమం ఉండదు.. ఆయ‌న ఎలుబ‌డిలో ఎలాంటి అభివృద్ధి జరుగదని ఎద్దేవా చేశారు. ఓ వేళ అభివృద్ధి జరిగితే.. ఒకరిద్దరు దళారులకు మాత్రమే ఆ ఫలితం దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ కు బీజేపీ 100 మైళ్ళ దూరంలో ఉందన్నారు. అది అందుకోవడం ముమ్మాటికీ గగనకుసుమమేనన్నారు. 25 ఏండ్ల పాలనలో గుజరాత్ లో ఇంటింటికి మంచినీరు అందించలేని, వారు దేశాన్ని ఏమైనా అభివృద్ధి చేస్తారా అని నిలదీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement