Saturday, November 23, 2024

ఇంజనీరింగ్ చెయ్యాలంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాల్సిందే

ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే ఇంటర్ లో మ్యాథ్స్ , ఫిజిక్స్ కచ్చితంగా ఉండాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తోంది. 2021-22 విద్యాసంవత్సరానికి ఇది సాధ్యం కాదని పేర్కొంటున్నది. ఇప్పటికే ఎంసెట్ షెడ్యూల్, పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్ లో మ్యాథ్, ఫిజిక్స్ తో పాటు ఇతర సబ్జెక్టులున్న కోర్సులనే ఎంచుకుంటారు. ఈనేపథ్యంలో ఇంజనీరింగ్ చేయాలంటే మ్యాడ్స్, ఫిజిక్స్ చదివి ఉండాల్సిన అవసరంలేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తాజాగా విడుదల చేసిన అర్హతలను ఈ ఏడాదికి అమలు చేయడం సాధ్యం కాదంటున్నారు. ఇంజనీరింగ్ చేయాలంటే మ్యాడ్స్, ఫిజిక్స్ మాత్రమే ఉండాలనే నిబంధనను తొలగిస్తూ నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని ఏఐసీటీఈ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నది. 2021-22 విద్యాసంవత్సరానికి యథావిధిగానే ఇంజనీరింగ్ ప్రవేశాలుంటాయన్నారు.

ఈ ఏడాది ఉండదు : పాపిరెడ్డి, ఛైర్మన్ ఉన్నత విద్యామండలి

మన దగ్గర ఎంపీసీ విద్యార్ధులే ఎక్కువగా ఉంటారు. ఏఐసీటీఈ చెప్పినపలు కాంబినేషన్లతో కూడిన సబ్జెక్టులు మన దగ్గర ఉండవు. కరోనా నేపథ్యంలో తరగతులే సరిగా నడవలేదు. 2022-28 విద్యాసంవత్సరంలో అమలుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అప్పుడు ఆలోచిస్తాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement