భారతదేశంలో 130కోట్లకు పైగా టీకా డోసులను వేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఓ ఘనతని సాధించింది. ఈ రాష్ట్రంలో వంద శాతం తొలి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయింది. ఈ వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 61 శాతం మందికి రెండో డోసు వ్యాక్సినేషన్ కూడా పూర్తయిందని వివరించారు.వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ప్రతి ఒక్క వైద్య సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారని… వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ రెండో డోసుని అందరూ తప్పకుండా వేయించుకోవాలని వైద్యులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..