Wednesday, November 20, 2024

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా అరెస్టు

హైద‌రాబాద్ : నిజామబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా ను ఏసీబీ అధికారులు శ‌నివారం సాయంత్రం అరెస్టు చేశారు. తార్నాక‌లోని ఆయ‌న నివాసంలో దాదాపు 8 గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించిన అనంత‌రం ర‌వీంద‌ర్ గుప్తాను అరెస్టు చేస్తున్న‌ట్లు ఏసీబీ అధికారులు ప్ర‌క‌టించారు. ర‌వీంద‌ర్ గుప్తాను ఏసీబీ అధికారులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌రికాసేప‌ట్లో ప్ర‌త్యేక ఏసీబీ కోర్టులో ర‌వీంద‌ర్ గుప్తాను అధికారులు హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

నిజామాబాద్ జిల్లా ప‌రిధిలోని భీమ్‌గ‌ల్‌లో ప‌రీక్షా కేంద్రం ఏర్పాటుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు వీసీ ర‌వీంద‌ర్ గుప్తా రెడ్ హ్యాండెడ్‌గా నేటి ఉదయం చిక్కారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని భీమ్‌గల్‌లో )పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రవీందర్‌ గుప్తా లంచండ డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన అడిగిన మొత్తాన్ని నిర్వహాకులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ కేసులో అయనను అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement