Tuesday, November 19, 2024

Telangana University Vc: ఏసీబీ వలలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్ లో పడ్డారు. రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించారు. వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా.. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.

అయితే ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు వీసీ రవీందర్ గుప్తా. ఈ క్రమంలో బాధితుడు శంకర్‌ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి బాధితుడు డబ్బు ఇవ్వబోయాడు. ఆ టైంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రవీందర్‌ గుప్తా. ప్రస్తుతం వీసీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement