Friday, November 22, 2024

రేపే టెట్, గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.. నిమిషం లేట్​ అయినా నో పర్మిషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. టెట్‌ మొదటి పేపర్‌ ను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులను గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. ఉదయం పరీక్షకు 9.30 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2. 30 గర్టల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. పరీక్షా సమయం ముగిసే వరకు ఉదయం 12 గంటల కంటే ముందు, సా.5 గంటలకు ముందు విద్యార్థులను బయటకు పంపే ప్రసక్తే లేదన్నారు. అభ్యర్థులు పరీక్షా సమయం ముగిసే వరకు కూడా పరీక్షా కేంద్రంలోని తమ సీట్లలో ఉండాల్సిందేనన్నారు.

అభ్యర్థులు ఐడీ, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను నమోదు చేసి టెట్‌ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ అభ్యర్థుల ఫోటో, సంతకం హాల్‌టికెట్‌పై లేకుంటే అటెస్టేషన్‌ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఫోటో, సంతకం సరిగా లేకపోయినా, అసలు లేకపోయినా సదరు అభ్యర్థులు హాల్‌ టికెట్‌పై ఇటీవలే తీయించుకున్న ఫోటోను అతికిం చాల న్నారు. అనంతరం గెజిటెడ్‌ అధికారిచే అటెస్టేషన్‌ చేయించి, ఆధార్‌కార్డు లేదా ఇతర ఐడీ కార్డుతో సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్ర దించా లన్నారు. డీఈవో పరిశీలన అనంతరం అభ్యర్థులను టెట్‌ ఎగ్జామ్‌ను రాయడానికి అనుమతి స్తామని వెల్లడిం చారు. అభ్యర్థుల పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టినతేదీ, కులం, లింగం, పీహెచ్‌సీ తదితర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలో నామినల్‌ రోల్‌తోపాటు ఫోటో ఐడెంటిటీలో సరిచేసుకునే అవకాశం ఉందని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement