Tuesday, November 26, 2024

ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాలు.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ

ఆక్సిజన్ తరలింపు కోసం విమానాలను వాడుతున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఒడిశాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో విమానాలు బయలుదేరాయి. 3 రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసమైన రోగులకు ప్రాణవాయువు అందనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెలకు, అధికారులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది.

అయితే కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు తెలంగాణలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్న ఆక్సిజన్‌ ప్లాంట్ల నుంచి లభిస్తోంది. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్‌, అంగుల్‌ (ఒడిశా), పెరంబుదూర్‌ నుంచి తీసుకోవాలని సూచించింది. తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్‌ప్లాంట్‌ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్‌ టన్నులే. వైజాగ్‌ నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్‌, పెరంబుదూర్‌, అంగుల్‌ నుంచి ఆక్సిజన్‌ తెచ్చుకోవడం తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్‌ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement