Wednesday, November 20, 2024

విద్యార్థులు ఉంటేనే పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీ

తెలంగాణలోని పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. విద్యార్థుల్లేని స్కూళ్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకూడదని భావిస్తోంది. విద్యార్థులే లేనప్పుడు ఈ ఖాళీల భర్తీ ఎందుకని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం అంగీకరిస్తే సుమారు 2 వేల టీచర్ పోస్టులు భర్తీకి నోచుకునే అవకాశం లేదు.

ఈ క్రమంలోనే విద్యార్థులు లేని స్కూళ్లలోని ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని పాఠశాలల్లో 2వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్థాయిలోనే ఉన్నట్టు తేలింది. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ గురువారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో 12 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిర్ధా రణకు వచ్చారు. సాధారణంగా ఒక్కో టీచరుకు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మం ది, హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థులుండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసంధానిస్తారు. అలాగే జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఈ వార్త కూడా చదవండి: శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ నోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement