Friday, November 22, 2024

ఎమ్మెల్యేల‌కు స‌ర్పంచ్ ల సెగ – స్థానిక బిల్లుల పంచాయితీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కేంద్ర సర్కారు అప్రకటిత సహాయ నిరాకరణతో ఆర్థికంగా కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొం టున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి క్షేత్రస్థాయి నుంచి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నిక లకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని అసెంబ్లి నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి గ్రామస్థాయి నాయకత్వం నుంచి వ్యతిరేకత వస్తోంది. పూర్తియిన అభివృద్ధి పనులకు సంబంధించి గడిచిన రెండేళ్ళ కాలంగా సరాసరిగా రూ.42 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో గ్రామగ్రామాన నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఎమ్మెల్యేలంతా స్థానికంగా పాదయాత్రలకు సిద్ధం కావాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు తాజాగా ఇచ్చిన ఆదేశాల అమలుకు ఈ కారణంగా ఆటంకం కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో దాదాపు 10 వేలకు పైగా సర్పంచ్‌లు, వేల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధిలు సొంత పార్టీకి చెందినవారే అయినప్పటికీ, వారంతా పెండింగ్‌ బిల్లుల పోరాటంతో విసిగి వేసారి ఉన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా సైలెంట్‌గా ఉంటూనే సహాయ నిరాకరణ బాట పట్టారు. ఈ క్రమంలో గత్యంతరం లేక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.

ఈ సారి ఎన్నికలను ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీ-ఆర్‌ కసరత్తు ముమ్మరం చేశారు. 33 జిల్లాల పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడంకోసం, ప్రజలకు మరింతగా అందుబాటు-లో ఉండేలా స్థానికంగా కార్యకలాపాలను మెరుగుపర్చడానికి ప్రత్యేక బృందాలను నియమించినప్పటికీ దైర్యంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్‌చార్జ్‌ను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్న నిర్ణయంతో రానున్న మూడు, నాలుగు నెలల్లో పార్టీ కార్యకర్తలను ఏకం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నది అధికార పార్టీ ముఖ్యోద్దేశం. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో కేటీ-ఆర్‌ -టె-లికాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంలోనూ మెజారిటీ నాయకుల నుంచి గ్రామస్థాయిలో పెండింగ్‌ బిల్లుల సమస్య చర్చకు వచ్చింది. ప్రతిపాదిత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేయాలంటే ముందుగా స్థానిక సర్పంచ్‌ల ఆందోళనకు తెర పడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల మొదలుకుని తక్షణమే జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహించాలన్న లక్ష్యానికి ఊహించని విధంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండడం రాజకీయ సమస్యకు దారితీస్తోంది.

గ్రామాలు, నియోజకవర్గాల్లో నిత్యం నిరసనల పర్వం
ఇటీ-వల నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ తన సిబ్బందితో కలిసి భిక్షమెత్తారు. సర్పంచ్‌నయ్యా.. దానం చేయండి! అంటూ బ్యానర్‌ పట్టు-కుని, డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా ప్రత్యేక చర్చకు దారితీసింది. అలాగే నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పడగల్‌ వడ్డెర కాలనీ సర్పంచ్‌ ముత్తెమ్మ భర్త మల్లేష్‌ పంచాయతీ అభివృద్ధి పనుల కోసం అప్పులు చేశాడు. బిల్లులు రాకపోవడంతో, తెచ్చిన అప్పులు కట్టలేక ఈ మధ్యనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బిల్లులు చెల్లించేందుకు నిధులు లేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో సర్పంచ్‌ల పరిస్థితి అటు- చెంపదెబ్బ, ఇటు- గోడదెబ్బ అన్నట్టు-గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రూ.వందల కోట్లు- పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల్లేక పోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. సిబ్బంది వేతనాలు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్నిచోట్ల రక్షిత మంచినీటి సరఫరా చేసే విద్యుత్‌ మోటార్లు పాడైతే మరమ్మతు చేసే పరిస్థితి కూడా లేదు. మరికొన్ని చోట్ల లక్షల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లు.. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు-న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో వడ్డీలు కట్టలేక, కుటు-ంబ పోషణ కూడా భారమై దినసరి కూలీలుగా మారుతున్నారు.

పార్టీపై కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన
బకాయపడిన నిధుల విడుదల, బిల్లుల చెల్లింపులో జాప్యానికి తాము కారణం కాదంటే, తాము కూడా కారణం కాదని అంటు-న్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము ఇచ్చిన డబ్బుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకుంటు-న్నాయి. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిరసన కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులకు సమానంగా తాము కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

- Advertisement -

చిన్న పంచాయతీల్లో పరిస్థితులు దుర్భిక్షం
అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆదాయం అంతగా లేని కొన్ని చిన్న పంచాయతీల్లో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (గత ఏప్రిల్‌ నుంచి) 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మరోవైపు పలు గ్రామ పంచాయతీలకు దాదాపు 6 నెలలుగా రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ నిధులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి వచిన్చ నిధులకు సంబంధించిన వినియోగ సరిప్టిnకెట్లు- (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు-) రాష్ట్రం సమర్పించలేదని, అందుకే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి.

సొంత వనరులు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారం
మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో (జీపీలు) 7,100కు పైగా మైనర్‌ పంచాయతీలు, వాటిలో కొత్తగా ఏర్పా-టైన పంచాయతీలు 4,383 ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఐదారు వందల లోపు జనాభా ఉన్న పంచాయతీలే ఎక్కువగా ఉండగా, సొంత ఆదాయ వనరులు లేక ఈ పంచాయతీలన్నీ పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. కాగా 15వ ఆరిక్ధసంఘం నిధులు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు- రాష్ట్రానికి రావాల్సి ఉంది. అలాగే నాలుగు నెలల కాలానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ నిధులు పంచాయతీలకు విడుదల కాలేదు. అవి కూడా దాదాపుగా అంతే మొత్తంలో ఉన్నట్లు సర్పంచ్‌లు చెబుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా..
ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం, రాష్ట్రం నుంచి నెలకు రూ.13 కోట్లు- వస్తున్నాయి. ఏప్రిల్‌ నుంచి కేంద్రం నిధులు, గత రెండు నెలలుగా రాష్ట్ర నిధులు రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలున్నాయి. ప్రతినెలా విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10.30 కోట్లు- రావాలి. కానీ ఈ మార్చి నుంచి నిధులు రాలేదు. ఇక చేపట్టిన పనులకు సర్పంచులకు ఏడాదిన్నరగా బిల్లులు రాలేదు. చిన్న జీపీలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా, పెద్ద పంచాయతీలకు రూ.12 నుంచి రూ.18 లక్షల దాకా పెండింగులో ఉన్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా..
మొత్తం జీపీలు 1,507. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్రాల్ర నుంచి రూ.203.39 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీ-వల ఆదిలాబాద్‌ జిల్లా బేల మండల సర్పంచ్‌లు నిధుల విడుదలలో జాప్యానికి నిరసనగా ధర్నాకు దిగారు.

సూర్యాపేట జిల్లా..
సూర్యాపేట జిల్లాలో 475 జీపీలున్నాయి. నెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8.75 కోట్లు-, ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.8.25 కోట్లు- రావాల్సి ఉంది. కానీ కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. అయితే ఇటీ-వలే ఎస్‌ఎఫ్‌సీ ఒక నెల నిధులు రూ.8.25 కోట్లు- ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 15 ఆర్థిక సంఘం నిధులు రూ.70 కోట్లు-, ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ. 24.75 కోట్లు- పెండింగులో ఉన్నాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 1,692 గ్రామ పంచాయతీలున్నాయి. ఎస్‌ఎఫ్‌సీ నుంచి రూ.89.63 కోట్ల నిధులు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.45 కోట్లు- పెండింగ్‌లో ఉన్నాయి.

‘ఉపాధి’ పథకం నిధులూ పెండింగ్‌
ఇక జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు పెండింగ్‌ కూలి రూ.160 కోట్లతో పాటు-, మెటీ-రియల్‌ కాంపోనెంట్‌ కూడా రూ.600 నుంచి రూ.700 కోట్లు- కేంద్రం నుంచి రాలేదు. వీటితో పాటు- దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉపాధి బకాయిల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిబంధలను విరుద్ధంగా ఇతర పనులకు ఉపయోగించిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.152 కోట్లు- తమకు తిరిగి చెల్లించాలంటూ రాష్ట్రానికి కేంద్రం నోటీ-సులు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఇక పెండింగ్‌ బిల్లులు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లింది. ఈ క్రమంలోనే స్థానిక నేతలు సహాయ నిరాకరణ బాట పట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement