తెలంగాణ ఏర్పాటు అనంతరం కన్నుల పండువగా సంబురాలు
మెగా ఉత్సవం.. బతుకమ్మ ఉత్సవాల్లో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బతుకమ్మల ర్యాలీ ప్రారంభించిన మంత్రి
మహబూబ్‌నగర్ (ప్రభ న్యూస్) : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లని పాలమూరు జిల్లా.. నాటి సాంప్రదాయాలను కాపాడటంలో జిల్లా ముందుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం బతుకమ్మ సంబరాల కార్యక్రమం లో భాగంగా మినీ ట్యాంక్ బండ్‌పై నిర్వహించే మెగా బతుకమ్మ కార్యక్రమాలు జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుడి నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సంస్కృతిక కళాసారథి బృందాలు బతుకమ్మ పాటలతో ఆడ పడుచులు, యువతులు బతుకమ్మలతో మినీ ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మలు, విద్యుత్ దీపాలు, బాణా సంచాల లేజర్ షో లతో సప్తవర్ణ శోభితమయ్యింది. కళాకారులు బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ పాటలు అందరిని ఆకర్షించాయి. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వా త పాలమూరు సంస్కృతి , సాంప్రదాయాలు, బతుక మ్మ పండుగలను సంబు రంగా జరుపు కుంటున్నా మ న్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కనుమరుగైన కళలను, సాంస్కృతిక కళా సంప దలను కాపా డేందుకు సీ ఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తు న్నారన్నారు. ఆధునిక సమాజంలోనూ రంగురంగుల పూలతో పేర్చిన బతు కమ్మను సా క్షాత్తు గౌరమ్మ అమ్మవారి గా భావించి మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. ఈ పండుగతో మహి ళలకు ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుస్తాయన్నారు. భవిష్య త్తులో సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడటం క నుమరుగైన పండుగలను భక్తి శ్రద్దలతో జరుపుకునేం దుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుం టుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింలు , వైస్ చైర్మన్ తాటి గణష్ , కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్లు, కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.