Monday, November 25, 2024

ఇహెచ్ఎస్ చందా.. మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన ట్రెసా

ప్రభుత్వ ఉద్యోగులకు నగదురహిత వైద్యం అమలుకోసం ఉద్యోగుల వేతనాల నుండి 2% చందా చెల్లిస్తామని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA ) సభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుని కలిశారు. ఉద్యోగుల చందా రెండు శాతం అయితే ఉద్యోగులంతా నష్టపోతారని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారని మంత్రికి వివరించారు. ఉద్యోగుల ఆవేదనను పరిగణలోకి తీసుకొని ఈ విషయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులపై పరిమితి లేకుండా నగదురహిత వైద్యం ఉచితంగా అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017 నుండి మూడు సంవత్సరాలు నగదురహిత వైద్యం అందినప్పటికీ ఇటీవల ప్రధానంగా కోవిడ్ కారణంగా కార్పోరేట్ హాస్పిటల్స్ ఆరోగ్య కార్డులపై వైద్యానికి అనుమతించటంలేదు. పిఆర్సీ కమిటీ ప్రతిపాదించిన 1% ఉద్యోగుల చందాపైనే నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని ట్రెసా కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు.. అన్ని సంఘాలతో చర్చించి ఉద్యోగుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆందోళన చెందవద్దని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement